- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో రేబిస్ వ్యాధితో ఒక బాలుడు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన మైదం శ్రీనివాస్ కొంతకాలం నుంచి మాదాపూర్ లో నివాసం ఉంటోంది. రెండు నెలల క్రితం శ్రీనివాస్ కుమారుడు శ్రీచరణ్‌ను కుక్క కరిచింది. వెంటనే అతనికి ఇంజక్షన్ కూడా చేయించారు. అయితే రెండు రోజుల క్రితం శ్రీచరణ్ అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు తార్నాకలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీచరణ్ మృతి చెందాడు.
- Advertisement -