నవతెలంగాణ – ఆర్మూర్
భారత ప్రధాన న్యాయమూర్తి (సిజేఐ) బి.ఆర్ గవాయ్ పై కాలి బూటుతో దాడికి యత్నించినటువంటి న్యాయవాది యొక్క ప్రవర్తనను, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ కోర్టు విధులను బహిష్కరించి బార్ హాలు నందు సమావేశమై తీవ్రంగా ఖండించడమైనది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులైన లోక భూపతి రెడ్డి, గంట సదానందం, చిలుక కిష్టయ్య, అమితాబ్ కిరాడ్ మాట్లాడుతూ.. న్యాయవాదులు దాఖలు చేసినటువంటి పిటిషన్ల పైన న్యాయమూర్తులు వారి యొక్క పూర్తి పరిజ్ఞానంతో మనకు మోదమైన, ఖేధమైన తీర్పులు ఇచ్చినప్పటికిని న్యాయవాదులు సంయమనంతో ఉండవలసిన అవసరం ఉందని అన్నారు.
న్యాయమూర్తుల పైన ఇటువంటి ప్రతిస్పందనలు ఏ న్యాయవాది కూడా చేయడం సరైనది కాదని, దీన్ని ముక్తకంఠంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాది తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల న్యాయవ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని, ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ప్రతి బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులకు సూచనలు ఇవ్వవలసిన అవసరం ఉందని అన్నారు. కానీ దీన్ని కొందరు రాజకీయం చేస్తూ న్యాయమూర్తి కులాన్ని ఆపాదించి రాజకీయం చేసే ప్రయత్నం చేయడం సరైనదికాదని అన్నారు.
న్యాయమూర్తిని ప్రతి న్యాయవాది ఓ దేవుడుగా భావించి గౌరవించడం జరుగుతుందని, దీన్ని ఓ కులానికి పరిమితం చేసి మాట్లాడడం, రాజకీయం చేయడం సరైనది కాదని అన్నారు. అందుకే న్యాయమూర్తి న్యాయవాది చేసిన దుష్ట చర్యను సైతం క్షమిస్తూ న్యాయవాధిపై ఎటువంటి కేసులు బనాయించవద్దని చెప్పడం ఎంతో గౌరవంతో కూడిన హుందాతనం ఇది సామాన్య వ్యక్తులతో సాధ్యమయ్యే పని కాదు కావున న్యాయమూర్తివలే న్యాయవాదులు సైతం గౌరవంగా ఉండి న్యాయవ్యవస్థను, న్యాయాలయ గౌరవాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, కోశాధికారి గజ్జల చైతన్య న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధుల బహిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES