- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, వందూర్ గూడ, గూడెం గ్రామాల్లో ప్రజలు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. గూడెం, నెల్కి వెంకటాపూర్ గ్రామాలను జనరల్ కేటగిరీగా మార్చాలని, వందూర్ గూడను తిరిగి నెల్కి వెంకటాపూర్ లో విలీనం చేయాలని వారు కోరుతున్నారు. గూడెం గ్రామంలో 35 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడం, అధికారుల నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో ఎన్నికలకు ఈ మూడు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
- Advertisement -


