Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక సమస్యలు పరిష్కరించాలని బీపీ కార్మికుల సమ్మె నోటిస్

కార్మిక సమస్యలు పరిష్కరించాలని బీపీ కార్మికుల సమ్మె నోటిస్

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట :  మండలంలోని జిపి కార్మికుల సమస్యల పరిష్కరించాలని అఖిలభారత కార్మిక సంఘాల పిలుపుమేరకు గోవిందరావుపేట ఎంపీడీవో చిలువేరు వరుణ్ కుమార్ కు బుధవారం సమ్మె నోటీసు అందించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ గోవిందరావుపేట మండల నాయకులు గరుగు ఐలయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులు హరిస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ  గురువారం 12వ తారీకు ఉదయం గోవిందరావుపేట తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగే నిరసన కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మండలంలోని కార్మికులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో జిపి కార్మికులు తహరుద్దీన్, సంపత్ ఓదేలు అశోక్ రవి, సారమ్మ, రవి,  రాజు వెంకటేశ్వర్లు ప్రశాంత్ సారయ్య పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -