అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఘాటి’. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ సమర్పిస్తుంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూలై 11న రిలీజ్ కానుంది. మేకర్స్ తాజాగా జానపద ఊపుతో నిండిన పాట ‘సైలోరే’ సాంగ్‌ని విడుదల చేశారు. ఇది ఓ ఎనర్జిటిక్ బ్లాస్టర్‌లా ఉంది. ప్రకతి సౌందర్యంతో నిండిన అడవులను నేపథ్యంగా చేసుకున్న ఈ ఫోక్ వెడ్డింగ్ యాంథమ్‌లో లీడ్ పెయిర్ ఉత్సవంగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. అనుష్క, విక్రమ్ కొత్తగా పెళ్లి అయిన జంటగా సంగీతం, నత్యం, సాంస్కతిక వెలుగులతో చుట్టూ ఉంటూ అడవిని రంగుల విందుగా, మేళా తాళాలతో, భావోద్వేగాలతో నింపారు. నాగవెళ్లి విద్యాసాగర్ స్వరపరిచిన ఈ మనసును తాకే పాట జానపదపు స్వరాలను భావోద్వేగాలకు మిళితం చేస్తూ అద్భుతంగా ఉంది. కష్ణ రాసిన సాహిత్యం హుషారుగా ఉంది. లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి ఆలపించిన ఈ పాట ఉత్సవాన్ని మరింత పెంచింది. రాజు సుందరం కోరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు జంటగా నటించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: మనోజ్ రెడ్డి కాటసాని, ఆర్ట్ డైరెక్టర్: తోట తరణి, సంగీతం: నాగవెల్లి విద్యా సాగర్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, కథ: చింతకింది శ్రీనివాసరావు.