నవతెలంగాణ-పాలకుర్తి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఅర్పి) సోషల్ మీడియా జనగామ జిల్లా కన్వీనర్‌గా పాలకుర్తి మండలానికి చెందిన కాసోజు బ్రహ్మచారిని నియమిస్తూ మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఎంతో నమ్మకంతో తనకు సోషల్ మీడియా బాధ్యతను అప్పగించారని, పార్టీ కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా బాధ్యులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. తన నియామకానికి కృషిచేసిన తీన్మార్ మల్లన్నతో పాటు పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లబోయిన అశోక్ ముదిరాజ్, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ ఆకుల మనోజ్,నార్త్ సోషల్ మీడియా కన్వీనర్ ఆవుల శ్రీనివాస్ గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
టీఆర్పీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్గా బ్రహ్మచారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


