నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో రక్షాబంధన్ పండుగ సందర్భంగా బ్రహ్మకుమారి జయ, బ్రహ్మ కుమారిస్, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కి రాఖీ కట్టారు. అనంతరం గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ పండగ అన్నా చెల్లెళ్ల, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతికగా రాఖీ పండుగ నిలుస్తుంది అని తెలిపారు. ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి మేము మీకు రక్ష మాకు మీరు రక్షా అనే నినాదాన్ని చాటుతారని తెలిపారు.ఈ కార్యక్రమంలో,కామారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్లు, పంపరి లతా శ్రీనివాస్, పిడుగు మమతా సాయిబాబా, జూలూరి సుధాకర్, రంగా రమేష్, అనిల్, బ్రహ్మకుమారీలు, గంగా, కవిత, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీకి రాఖీ కట్టిన బ్రహ్మకుమారి జయ
- Advertisement -
- Advertisement -