Sunday, July 6, 2025
E-PAPER
Homeజిల్లాలుతాగునీటి కోసం బ్రాహ్మణపల్లి గ్రామస్తుల నిరసన 

తాగునీటి కోసం బ్రాహ్మణపల్లి గ్రామస్తుల నిరసన 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామస్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు శనివారం గ్రామపంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గత పది రోజులుగా గ్రామంలో త్రాగునీరు రావడంలేదని, పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు విన్నపించినా.. పట్టించుకోవడంలేదని అన్నారు. వర్షాకాలం కావడంతో వర్షంనీరు తాగితే ఏదైనా రోగాలు వస్తే ఎవరు బాధ్యులని నిలదీశారు. అధికారులు తక్షణమే స్పందించి బ్రాహ్మణపల్లికి తాగునీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -