Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటి నుండి కాలభైరవుడి బ్రహ్మోత్సవములు 

రేపటి నుండి కాలభైరవుడి బ్రహ్మోత్సవములు 

- Advertisement -

అంగరంగ వైభవంగా 5 రోజులు వేడుకలు 
ఏర్పాట్లను పూర్తి చేసిన ఆలయ కమిటీ 
నవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలోని ఇసన్నపల్లి(రామారెడ్డి) లో వెలసిన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ రాష్ట్రం తో పాటు, వివిధ రాష్ట్రాల నుండి సందర్శకులు రానున్నందున అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆదివారం గణపతి పూజతో ప్రారంభమై, బద్ది పోచమ్మకు బోనాలు, సోమవారం సాయంత్రం గం 6:00 లకు లక్ష దీపార్చన, మంగళవారం రాత్రి గం 8:00 ఇసన్నపల్లి, రామారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, బుధవారం ఉదయం 6 గంటలకు సంతతధారభిషేకం, గం 7:05 నుండి 10:30 ని; ల వరకు ధ్వజారోహణము, సాయంత్రం గం 7:00 ఎడ్లబండ్ల ఊరేగింపు, పల్లకి సేవ , సాంస్కృతిక కార్యక్రమాలు, గురువారం ఉదయం గం 2:00 రథోత్సవం, గం;6:00 దక్షయజ్ఞము (అగ్నిగుండములు) లతో స్వామి వారి వేడుకలు ముగియునని ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రభు రామచంద్రం తెలిపారు.

 ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఆలయ కార్య నిర్వహణ అధికారి ప్రభు రామచంద్రం 
స్వామి వారి జన్మదిన ఉత్సవాలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాము. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంతో పాటు, పక్కన గల మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -