Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రాంచ్ మాస్టర్ లకు కొత్త మొబైల్ ఫోన్లో అందజేత...

బ్రాంచ్ మాస్టర్ లకు కొత్త మొబైల్ ఫోన్లో అందజేత…

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అర్హులైన వారికి పింఛన్ల పంపిణీ మరింత మెరుగ్గా జరిగేందుకు జిల్లాలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు కొత్త మొబైల్ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ డివైస్లు ఇతర సాంకేతిక పరికరాలు కిట్లను మంగళవారం కలెక్టరేట్ లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం  229 సెట్లు మంజూరయ్యాయని, ఆధునిక పరికరాల ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ సులువుగా జరుగుతుందన్నారు.లేదంటే మంత్ర డివైస్ ద్వారా గాని ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా గాని ఫించను పంపిణీ చేయవచ్చన్నారు. అతి తక్కువ సమయంలో ఈ పరికరాలతో ఎక్కువ మందికి పింఛన్లు పంపించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా  గ్రామీణభివృద్ది అధికారి నాగిరెడ్డి, పెన్షన్ ఏపీవో శ్రీనివాస్,బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -