- Advertisement -
భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు గ్లోబల్ ఐకాన్ రామ్‌చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్ (ఏఏఐ) గురువారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, ‘ఆర్చరీ అనే క్రీడ..క్రమశిక్షణ, ఫోకస్ కలిగి ఉంటుందన్న కారణంతో బంధాన్ని ఏర్పర్చుకున్నాను. ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌తో కలిసి కొనసాగడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.
- Advertisement -