Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమల్లన్న సాగర్‌ నుంచి వచ్చే కెనాల్‌ కాల్వకు గండి

మల్లన్న సాగర్‌ నుంచి వచ్చే కెనాల్‌ కాల్వకు గండి

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యమేనని అంటున్న గ్రామస్తులు
నవతెలంగాణ-మిరుదొడ్డి

మల్లన్నసాగర్‌ నుంచి వచ్చే కెనాల్‌ కాల్వకు గండి పడింది. పైర్లకు చివరి సమయంలో కాల్వకు గండి పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాల్టీ పరిధిలోని చెల్లాపూర్‌ గ్రామంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ వైపు వెళ్తున్న 31వ కేఎంకు చెందిన కాల్వకు గురువారం గండి పడింది. దాంతో కెనాల్‌ కాల్వ కింద ఉన్న పంటలు ఎండిపోతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాల్వ నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడూ కాలువను పర్యవేక్షించకపోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కాలువ మరమ్మతు పనులను చేపట్టాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -