- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల వసూళ్లు ఆగిపోతాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన టారిఫ్ కోడ్‌లను తమ కార్గో సిస్టమ్స్‌లో డియాక్టివేట్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే, ఇప్పటివరకు వసూలు చేసిన సుంకాలను దిగుమతిదారులకు తిరిగి చెల్లిస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.
- Advertisement -



