Wednesday, March 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమత్తును చిత్తుచేయండి

మత్తును చిత్తుచేయండి

- Advertisement -

మరింత ఉత్సాహంగా పనిచేయండి
ఎక్సైజ్‌ ఉద్యోగులకు క్యాష్‌ రివార్డుల ప్రదానోత్సవంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

రాష్ట్రంలో అక్రమ మత్తు పదార్ధాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఎక్సైజ్‌శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం అన్నారు. దీనికోసం ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తున్నాయని తెలిపారు. సిబ్బంది అంకితభావమే యువత పెడతోవ పట్టకుండా కాపాడుతున్నదనీ, సమాజం ఎక్సైజ్‌ సిబ్బంది సేవల్ని గుర్తించాలని కోరారు. మంగళవారంనాడిక్కడి అబ్కారీ భవన్‌లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ చాంబర్‌లో విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 ఎక్సైజ్‌ టీంలకు నగదు రివార్డులను ఆయన అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవార్డులు, రివార్డులు ఉద్యోగుల పనితీరును, బాధ్యతను పెంచుతాయని చెప్పారు. రివార్డులు అందుకున్న వారిలో మెదక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జీ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జీ గణేశ్‌లతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో గంజాయి, హ్యాషిస్‌ ఆయిల్‌, నల్ల బెల్లం పట్టుకున్న పలువురు ఉద్యోగులకు నగదు బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌శాఖ జాయింట్‌ కమిషనర్‌ అంజన్‌రావు, డిప్యూటి కమిషనర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -