నవతెలంగాణ-హైదరాబాద్:
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పందించారు. చిత్రంలోని హింసను చూపించిన తీరుపై థరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కథా గమనానికి అవసరమైన దానికంటే ఎక్కువగా రక్తపాతం, క్రూరత్వం, అసహ్యకరమైన దృశ్యాలను మితిమీరి చూపించారని ఆయన విమర్శించారు. చిత్రంలోని రాజకీయ కోణాలు, ప్రచార ధోరణి అంశాలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
భారత్-పాకిస్తాన్ సంబంధాలను చిత్రీకరించిన విధానం ప్రజల్లో విద్వేష భావాలను పెంచే ప్రమాదం ఉందని, తెరపై చూపిన ఉద్రిక్తతలు వాస్తవ ప్రపంచంలో రెండు దేశాల ప్రజల మధ్య చెడు భావాలను పెంచవచ్చని అన్నారు.సినిమాలో చూపించినట్లుగా విదేశాల్లో బాంబు పేలుళ్లు, హై-రిస్క్ యాక్షన్ ఆపరేషన్లు నిజ జీవితంలో జరగవని చెప్పారు. అందుకే దీన్ని కల్పిత చిత్రంగానే చూడాలంటూ ముగించారు.






కామెంట్‌లు (0)