నవతెలంగాణ-హైదరాబాద్ : దూకుడుగా ఆడుతున్న భారత్-ఎ ఓపెనర్ అభిషేక్ శర్మ 37 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జనిత్ లియానగే వేసిన 14 ఓవర్‌లో తొలి బంతికి బౌండరీ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. వైభవ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ నిలకడగా ఆడుతున్నాడు. రవిందు ఫెర్నాండో వేసిన 13 ఓవర్‌లో తిలక్ ఓ సిక్స్ బాదాడు. ప్రస్తుతం 16 ఓవర్లకు భారత్-ఎ స్కోరు 128/1గా ఉంది. తిలక్ (22), అభిషేక్ (55) పరుగులతో ఉన్నారు.
అంతకు ముందు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఔటయ్యాడు. జనిత్ లియానగే వేసిన ఎనిమిదో ఓవర్‌లో చివరి బంతికి లసిత్ క్రూస్పులెకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.






కామెంట్‌లు (0)