Magazines

ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వైపు ఐద్వా మార్చ్

17 అక్టోబర్, 2026

AIDWA march
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఢిల్లీ నిరసనలో పాల్గొన్న మహిళలు, విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ..ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (AIDWA), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (NFIW), ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ (AIPWA), అలీఫాతో సహా పలు మహిళా సంఘాలు శనివారం ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయం వైపు కదంతొక్కాయి. సంయుక్తంగా శాంతియుతంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించాయి.


సర్ (SIR)ను వ్యతిరేకిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని మహిళలు, విద్యార్థులు గళమెత్తారని, కానీ ఢిల్లీ పోలీసులు వారి పట్ల దురుసుగా వ్యవహరించారని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ) నాయకురాలు అన్నీ రాజా మండిపడ్డారు.


"ఓటు దొంగతనం అనేది అనేక విధాలుగా మహిళలపై జరిగే అతిపెద్ద దాడి. అందుకే తాము ఇక్కడ ఉన్నాం, SIRను రద్దు చేయాలని, CEC రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిరోజూ ఇక్కడ నిరసన తెలియజేస్తాం," అని ఆమె అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్