నవతెలంగాణ-హైదరాబాద్: పార్టీ నాయకుడు అజం ఖాన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ స్వాగతించారు, " గోరఖ్‌పూర్‌లో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. SP నేతకు న్యాయం జరుగుతుందని యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సత్యం గెలిచింది.. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఏకాదశి తర్వాత చర్చలు మొదలవుతాయని యాదవ్ పేర్కొన్నారు.
బుధవారం నాడు ఘజియాబాద్‌లోని దాస్నా జిల్లా జైలు నుంచి ఖాన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో అలహాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.







కామెంట్‌లు (0)