Magazines

బైక్‌ ట్యాక్సీలపై నిషేధం కుదరదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

3 గంటల క్రితం

Ban on bike taxis not feasible – Supreme Court’s key remarks
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధాన్ని సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిషేధం విధించడం కంటే నిబంధనలతో నియంత్రించడమే సరైన మార్గమని స్పష్టం చేసింది. బైక్‌ ట్యాక్సీలపై నిషేధాన్ని రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


జీపీఎస్‌ సౌకర్యం ఉండటంతో బైక్‌ ట్యాక్సీలు యువతులకు సురక్షితమని, ఆటోలతో పోలిస్తే ఐదు రెట్లు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని జస్టిస్‌ శర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలోని 25 రాష్ట్రాల్లో బైక్‌ ట్యాక్సీలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో ఓలా, ఉబెర్‌, రాపిడో సంస్థల పిటిషన్లపై విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు బైక్‌ ట్యాక్సీలకు నిబంధనల ప్రకారం అనుమతులు పరిశీలించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ కొట్టివేతకు గురైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్