నవతెలంగాణ - హైదరాబాద్ : నైజీరియాలోని బాయెల్సా రాష్ట్రంలో అంత్యక్రియలకు వెళ్తున్న ప్రయాణికులతో కూడిన పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మంది మృతి చెందగా, మరో 24 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పడవలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రయాణికులు హెచ్చరించినా పడవ నిర్వాహకుడు పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఘటన అనంతరం పారిపోయిన పడవ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నైజీరియాలో పడవ బోల్తా.. 24 మంది మృతి
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)