Magazines

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ కలకలం..

2 గంటల క్రితం

Shamshabad Air port
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్‌ కలకలం రేపింది. దుబాయ్‌ వెళ్లేందుకు వచ్చిన రాంచీకి చెందిన ఓ ప్రయాణికుడి బ్యాగులో తూటాను భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రయాణికుడిపై ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్