Magazines

తెలంగాణలో కొనసాగుతున్న చలితీవ్రత..

54 నిమిషాల క్రితం

chali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలో చలితీవ్రత కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తొలిసారిగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహీర్‌లో 9.7, న్యాల్‌కల్, ఝురాసంగంలో 10 డిగ్రీల ఉష్ణోగతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోని డోంగ్లీలో 10.5 డిగ్రీల ఊష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్, ధారూర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోంది. ఇక రాష్ట్రంలో రాబోయే రోజుల్లో చలితీవ్రత మరింత పెరిగనుందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. నవంబర్ 23 వరకు ఉత్తరతెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. నవంబర్ 24 నుండి 27 వరకు చలితీవ్రత కాస్త తగ్గి, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ లోనూ తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. నవంబర్ 28 నుండి డిసెంబర్ 1 వరకు చలితీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉందని ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్