నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో గత మూడు రోజుల్లో కల్తీ మద్యం సేవించి 12 మంది మృతి చెందారు. మరో 180 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నవంబర్ 18న ఐదుగురు, గురువారం ఒకరు, శుక్రవారం ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు కక్చింగ్ జిల్లాలోని సుగ్నూ ప్రాంతం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఘటనపై విచారణ మొదలైంది. ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ బాధితులను పరామర్శించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కల్తీ మద్యం కలకలం..మణిపూర్‌లో 12 మంది మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)