Magazines

కేఎల్ రాహుల్ సూపర్‌ సెంచరీ..భారీ స్కోరు దిశగా టీమిండియా

52 నిమిషాల క్రితం

KL Rahul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో కదంతొక్కగా, యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ కీలక ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఈ ఇద్దరి జోడీ కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపింది.

ప్రస్తుతం భారత్ 99 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 362 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(128) గిల్(45) ఉన్నారు. భారత్ ఇంకా 6 పరుగులు వెనుకంజలో ఉంది. కాగా జైశ్వాల్(85), పడిక్కల్(80) పరుగుల వద్ద ఔటయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్