Magazines

చుక్కా రామయ్య నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి

5 గంటల క్రితం

CM Revanth Reddy extends birthday wishes to Chukka Ramaiah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యాబోధనలో తనదైన శైలితో ఎంతోమంది యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడంతో పాటు, విద్యారంగ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచారని పేర్కొన్నారు. చుక్కా రామయ్య ఆయురారోగ్యాలతో, ఆనందంగా నిండు నూరేళ్లు జీవించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్