Magazines

ఈ నెల 26న నాగర్‌కర్నూల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

4 గంటల క్రితం

CM Revanth Reddy to visit Nagarkurnool on the 26th of this month
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 26న నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పదర మండలంలోని మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.28 కోట్లు, హరిత హోటల్ నిర్మాణానికి రూ.15 కోట్లు, సద్గురు సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు రూ.38 కోట్లతో కలిపి మొత్తం రూ.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ బలరాం నాయక్ తదితర అధికారులు శుక్రవారం బహిరంగ సభా స్థలంతో పాటు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్