Magazines

నేడు నాగర్‌కర్నూల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

4 గంటల క్రితం

cm Revanth
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. నియోజకవర్గంలో రూ.450 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా పదర మండలానికి హెలికాప్టర్‌ ద్వారా చేరుకుని పబ్బతి ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు అచ్చంపేటకు చేరుకుంటారు. తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌, ఇందిరమ్మ చీరల పంపిణీ, చేయూత కొత్త పించన్లను ప్రారంభించి, లబ్దిదారులకు అందజేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్