Magazines

పౌల్ట్రీ రైతులను సీఎం ఆదుకోవాలి: బండ్ల గణేష్‌

18 అక్టోబర్, 2026

Bandla Ganesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై తక్షణమే స్పందించి, రైతులను ఆదుకోవాలని ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈరోజు ఆయన ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఒక ప్రకటన చేశారు.

పౌల్ట్రీ పరిశ్రమకు కీలకమైన మొక్కజొన్న, సోయాబీన్, డీఓసీ వంటి ముడిసరుకులను కొందరు స్టాకిస్టులు అక్రమంగా గోదాముల్లో నిల్వ చేస్తున్నారని బండ్ల గణేశ్ ఆరోపించారు. దీనివల్ల మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి, ధరలను అమాంతం పెంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. "ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలి. పౌల్ట్రీ రంగానికి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలి" అని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్