Magazines

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కి జైలు శిక్ష

3 గంటల క్రితం

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కి జైలు శిక్ష
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేశ్‌రెడ్డి, మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డికి 2 వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలన్న హైకోర్టు ఉత్తర్వుల్ని నిర్లక్ష్యం చేయడంతో ఈ శిక్ష విధించింది. వారం రోజుల పాటు శిక్షపై సస్పెన్షన్‌ విధించిన న్యాయస్థానం.. ఆ లోగా ఉత్తర్వులు తెచ్చుకోకపోతే హైకోర్టు రిజిస్ట్రార్‌ ఎదుట లొంగిపోయి శిక్ష అనుభవించాలని ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్