నవతలంగాణ - హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను ప్రభావంతో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, గురువారం అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణకు తుపాను ముప్పు.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)