నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికాలోని డాలస్ నగరంలో హాలోవీన్ వేడుకల సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో నలుగురు మృతిచెందగా, మరో 15 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని డాలస్ పోలీస్ చీఫ్ డేనియల్ కమాక్స్ వెల్లడించారు. నగరంలోని మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఘటనలకు సంబంధించి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, డీప్ ఎలమ్ ఘటనతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్లు (0)