Magazines

జబర్దస్త్‌ కమెడియన్లకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు

3 గంటల క్రితం

Programme
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌ కమెడియన్లు రైజింగ్‌ రాజు, దొరబాబులకు తృటిలో ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం పెన్నాడా అగ్రహారం వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు.

కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం దెబ్బతింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారికి ప్రాణహాని లేదని వైద్యులు వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్