Magazines

డీలిమిటేషన్ బిల్లు: రాజీ పడే ప్రసక్తే లేదు: డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్

1 గంట క్రితం

Delimitation Bill: No question of compromise, says DMK leader M.K. Stalin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: వచ్చే వారం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టే నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి తమ పార్టీకి ఉన్న రెండు ప్రధాన డిమాండ్లను మరోసారి పునరుద్ఘాటించారు. లోక్‌సభ స్థానాల్లో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం వాటా ఏ పరిస్థితుల్లోనూ తగ్గకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు.


లోక్‌సభ సీట్ల మొత్తం సంఖ్యను పెంచినప్పటికీ, రాష్ట్ర ప్రస్తుత వాటాను తప్పనిసరిగా కాపాడాలని అన్నారు. 1971 జనాభా లెక్కల ఆధారంగా గతంలో స్తంభింపజేసిన పార్లమెంటరీ ప్రాతినిధ్యంలోని ప్రస్తుత అంతర్-రాష్ట్ర నిష్పత్తిని మరో 25 సంవత్సరాల పాటు కొనసాగించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు, రాజీ పడే ప్రసక్తే లేదు," అని ఆయన అన్నారు.


"

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్