నవతెలంగాణ - హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కంది గ్రామ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు యెల్లకొండ నరసింహులు (40), మౌనిక (33) అక్కడికక్కడే మృతిచెందారు. శంకర్‌పల్లి మండలం గాజులగూడెం గ్రామానికి చెందిన వీరు ఫోర్డ్ కారులో శంకర్‌పల్లి నుంచి సంగారెడ్డికి బయలుదేరారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో కంది వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. దీంతో కారులో ఉన్న భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కంది వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం



కామెంట్‌లు (0)