నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌లోని సోలుఖుంబు ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మౌంట్ ఎవరెస్ట్ వెళ్లే మార్గంలోని హెలిప్యాడ్ వద్ద రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ విదేశీయుడు మృతిచెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు.ఫిష్‌టెయిల్ ఎయిర్, డైనాస్టీ ఎయిర్ సంస్థలకు చెందిన హెలికాప్టర్లు ఉదయం 8.11 గంటల సమయంలో ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని హెలికాప్టర్‌లో లుక్లాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు, క్షతగాత్రుడి వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నేపాల్‌లో రెండు హెలికాప్టర్లు ఢీ.. ఒకరు మృతి
54 నిమిషాల క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)