నవతెలంగాణ-హైదరాబాద్: పౌల్ట్రీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్ 5 ఎన్ 1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) నియంత్రణకు భారత్ తొలి స్వదేశీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. భోపాల్‌లోని ఐసీఏఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) శాస్త్రవేత్తలు ఈ టీకాను రూపొందించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నవంబర్ 20న భోపాల్‌లో ఈ వ్యాక్సిన్‌ను దేశానికి అంకితం చేయనున్నారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో తరచూ బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతూ పెద్ద సంఖ్యలో కోళ్లు, ఇతర పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ కొంతకాలంగా పరిశోధనలు, పరీక్షలు చేపట్టి ఈ స్వదేశీ టీకాను అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ వాణిజ్యపరంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.






కామెంట్‌లు (0)