నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 16వ తేదీన జరగనుంది. ఉదయం సరిగ్గా 11 గంటలకు ఈ బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మెగా ఈవెంట్‌కు గోవా వేదికై నిలిచింది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 15నే ఫ్రాంచైజీల అధికారుల కోసం ప్రత్యేక బ్రీఫింగ్ సమావేశం కూడా జరగనుంది.
ప్రస్తుతం, అన్ని ఫ్రాంచైజీల వద్ద కలిపి మొత్తం రూ. 297.95 కోట్ల బడ్జెట్ (పర్సు బ్యాలెన్స్) అందుబాటులో ఉంది. ఈ వేలంలో మొత్తం 66 ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది; ఇందులో విదేశీ ఆటగాళ్ల కోసం 25 స్థానాలు, భారతీయ ఆటగాళ్ల కోసం 41 స్థానాలు ఉన్నాయి. తమ జట్లలోని లోపాలను సరిదిద్దుకుని, టైటిల్ కోసం పోటీ పడగల బలమైన జట్టును నిర్మించేందుకు ఫ్రాంచైజీలు ఈ వేలంలో ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తాయో వేచి చూడాలి.






కామెంట్‌లు (0)