నవతెలంగాణ - హైదరాబాద్: అవినీతి కేసులో నిజామాబాద్ జిల్లా మాజీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధరావత్ బాలాజీకి హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఆయనపై నమోదైన అవినీతి కేసులో నేరం రుజువు కావడంతో ఏడాది చొప్పున రెండు కఠిన కారాగార శిక్షలు విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల రెండో అదనపు ప్రత్యేక న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాషా బుధవారం (నవంబర్ 11) ఈ తీర్పు ఇచ్చారు.
అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డి) రెడ్‌విత్ 13(2) కింద బాలాజీని దోషిగా నిర్ధారించారు. ఒక్కో సెక్షన్ కింద ఏడాది చొప్పున జైలు శిక్షతో పాటు మొత్తం రూ.10 వేల జరిమానా విధించారు. అయితే రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా, నిజామాబాద్ జిల్లాలో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమాలకు, లంచం డిమాండ్‌కు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై 2011లో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం అభియోగాలు రుజువు కావడంతో ప్రత్యేక కోర్టు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.






కామెంట్‌లు (0)