Magazines

నేటి నుంచి SI పరీక్షలకు హాల్ టికెట్లు

4 గంటల క్రితం

Hall tickets for SI exams available from today
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో ఎస్సై ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 275 ఎస్సై పోస్టులకు 1,60,712 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 29న రాష్ట్రవ్యాప్తంగా 335 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు ముందుగానే హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్