Magazines

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

3 గంటల క్రితం

Horrific road accident in Rajasthan; 9 people dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ట్రక్కును భక్తులతో వెళ్తున్న వాహనం ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కోటా–ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై శంభుపుర గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సికార్ జిల్లాలోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయ దర్శనం అనంతరం మహారాష్ట్రకు తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఆరుగురికి కోటా మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్