నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలొని బెల్గాంలోని హనుమాన నగర్‌లో దసరా పండుగ రోజున భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు హత్యకు దారితీసింది. దసరా పండుగ సందర్భంగా, విఠల్ హెగ్డే అనే వ్యక్తి తన భార్య అశ్విని హెగ్డే (26) పై దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. ఏపీఎంసీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడైన భర్తను అరెస్టు చేశారు. బాధితురాలి తల్లి, అల్లుడు తన కూతురిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.







కామెంట్‌లు (0)