Magazines

కేకేఆర్‌ అభిమానుల ద్వేషం తట్టుకోలేకపోయా: వెంకటేశ్‌ అయ్యర్‌

14 నిమిషాల క్రితం

I couldn't stand the hatred of KKR fans: Venkatesh Iyer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఐపీఎల్‌లో కేకేఆర్‌ నుంచి ఆర్సీబీకి మారిన స్టార్‌ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2022 సీజన్‌కు ముందు శుభ్‌మన్‌ గిల్‌ను వదిలేసి తనను రిటైన్‌ చేసుకోవడంతో కేకేఆర్‌ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నానని వెల్లడించాడు. ఇప్పటికీ గిల్‌ సెంచరీ చేసినప్పుడల్లా సోషల్‌ మీడియాలో తనపై విమర్శలు వస్తుంటాయని ఆకాష్‌ చోప్రా పాడ్‌కాస్ట్‌లో తెలిపాడు.


2026 వేలానికి ముందు కేకేఆర్‌ తనను విడుదల చేయడంతో షారుఖ్‌ ఖాన్‌ను కలిసి నిర్ణయంపై మాట్లాడినట్లు, ఆ సమయంలో భావోద్వేగానికి గురయ్యానని చెప్పాడు. అనంతరం ఆర్సీబీలో చేరడం కొత్త అనుభూతినిచ్చిందన్నాడు. అభిమానులు జెర్సీలకు పూజలు చేయడం చూసి ఆశ్చర్యపోయానని తెలిపాడు. 2026 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 52.25 సగటుతో 209 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్