నవతెలంగాణ – బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ తన భార్యతో పాటు ఆమె బంధువులు సహా ఏడుగురిని హత్య చేశాడు. రాజాజీనగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడు ఇందు శేఖర్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు వివరాలు వెల్లడించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇందు శేఖర్‌కు సునీతతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య తరఫు బంధువులు తమ వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటున్నారనే కారణంతో కొంతకాలంగా వారితో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యతో పాటు ఆమె బంధువులను రోకలితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాలను నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేసినట్లు తెలిపారు. అక్టోబర్ 17 నుంచి ఒక్కొక్కరిని ఇంటికి పిలిపించి ఈ హత్యలకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.






కామెంట్‌లు (0)