నవతెలంగాణ – హైదరాబాద్: దీపావళి సందర్భంగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. నవంబర్ 6 నుంచి 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మదీనా, ముర్గీ చౌక్ తదితర మార్గాల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యామ్నాయ దారుల్లోకి మళ్లించనున్నారు. వాహనదారులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని పోలీసులు సూచించారు. అత్యవసర సహాయం కోసం 9010203626 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.





కామెంట్‌లు (0)