Magazines

అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం

47 నిమిషాల క్రితం

Nalgonda girl goes missing in America
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నల్గొండ జిల్లా యువతి అదృశ్యమైంది. కనగల్‌ మండలం శాబ్దులాపురం గ్రామానికి చెందిన కోయ్య యాదగిరిరెడ్డి, రూప దంపతుల కుమార్తె శ్రీజ (23) ఏడాది క్రితం ఉన్నత విద్య కోసం బోస్టన్‌కు వెళ్లింది. అక్కడ చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 2న సాయంత్రం నడకకు వెళ్లిన శ్రీజ తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఫోన్‌ లొకేషన్‌ సమీపంలోని బీచ్‌ ప్రాంతంలో చూపిస్తున్నప్పటికీ ఆచూకీ లభించలేదు. ఒక్కగానొక్క కుమార్తె అదృశ్యమవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అమెరికా అధికారులతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్