ప్రజా ప్రతినిధులు, నాయకులు వారితో కలిసి పండుగ జరుపుకోవాలని సీఎం విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఇందిరమ్మ ఇండ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. "మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ..!, పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండుగ శుభవేళ…ఇందిరమ్మ ఇండ్లలో, లబ్ధిదారుల సొంతింటి సంతోషంలో… నేను సైతం పాలుపంచుకోనున్నాను. ఈ దీపావళి సందర్భంగా, నేను ఇందిరమ్మ ఇంట్లో, లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోనున్నాను..... " అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.






కామెంట్‌లు (0)