Magazines

ట్రంప్ ప్రభుత్వానికి షాక్‌.. పౌర హక్కుల విభాగం చీఫ్ రాజీనామా

1 గంట క్రితం

Shock to Trump administration: Civil Rights Division chief resigns
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పౌర హక్కుల విభాగం చీఫ్‌గా పనిచేస్తున్న భారత సంతతి అధికారిణి హర్మీత్ కౌర్ థిల్లాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల తర్వాత ట్రంప్ యంత్రాంగం నుంచి వైదొలిగిన తొలి సీనియర్ అధికారిగా ఆమె నిలిచారు. తాను ఎన్నికలకు నెల రోజుల ముందే రాజీనామా సమర్పించానని, ఎన్నికలు ముగిసే వరకు కొనసాగాలని ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కోరినట్లు ఆమె వెల్లడించారు. 18 నెలల పదవీకాలంలో పౌర హక్కుల విభాగం ప్రాధాన్యతలను మార్చడంతో పాటు పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. సిక్కు ట్రక్కు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకోవడాన్ని మాత్రం ఆమె వ్యతిరేకించారు. చండీగఢ్‌లో జన్మించిన హర్మీత్ చిన్నతనంలో కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్