Magazines

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

1 గంట క్రితం

Fatal road accident in Jharkhand.. Seven dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : ఖుంటి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీ ప్రమాదం జరిగిన ప్రదేశంలో బాధితులకు సహాయం చేసేందుకు గుమిగూడిన వారిపైకి వేగంగా వచ్చిన ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్