Magazines

‘ఇడుపు కాయితం’ టీజర్‌ విడుదల

2 గంటల క్రితం

‘Idupu Kayitham’ teaser released
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’పై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సంప్రదాయాలు, కుటుంబ భావోద్వేగాల కలయికతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అవుతున్నారు. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తుండగా, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ‘శ్రీలత’, ‘గడప’, ‘బరాత్ బీట్’ పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. తాజాగా టీజర్ కూడా యూట్యూబ్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్