నవతెలంగాణ - హైదరాబాద్ : పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుపాను తీవ్రరూపం దాల్చడంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అప్రమత్తత ప్రకటించారు. తుపాను ప్రభావంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం నుంచి నడిచే 53 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తుపాను నేపథ్యంలో దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడంతోపాటు రైల్వే ట్రాక్‌లకు నష్టం వాటిల్లకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథుర్ సోమవారం నాలుగు డివిజన్ల డీఆర్‌ఎంలతో పరిస్థితిని సమీక్షించారు. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, విశాఖపట్నం, పార్వతీపురం, నరసాపురం, మచిలీపట్నం, భీమవరం, గుంటూరు తదితర ప్రాంతాల మధ్య ప్రయాణించేవారు రైళ్ల రద్దు, మార్పుల వివరాలను ముందుగా తెలుసుకుని ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.





కామెంట్‌లు (0)